CM Chandrababu: తెలుగుదేశం పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్‌షాప్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎవరికిచ్చిన పదవిలో వారే బాధ్యతగా పని చేయాలని, కావాలని వివాదాలు సృష్టిస్తే సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత అజెండాలు, అనవసర వివాదాలతో పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని…