గొల్లపూడిలో అరెస్ట్ చేసిన దేవినేని ఉమా అనుచరుడు ఆలూరి హరికృష్ణ (చిన్నా)ను భవానీపురం పోలిస్ స్టేషన్ కు తరలించారు. 41 నోటీస్ ఇచ్చి చిన్నాను విడుదల చేశారు పోలీసులు. మరోసారి పిలిచినప్పుడు స్టేషన్ కు రావాలని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నా విడుదల అయిన అనంతరం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడారు. టీడీపీ నాయకుల పై అక్రమ కేసులు… ఏం సాధించవ్ జగన్…? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రానికి అంబేద్కర్ రాజ్యాంగం…