టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం టీడీఎల్పీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. సమావేశం అనంతరం అసెంబ్లీకి హాజరు కాకూడదని ప్రకటించనుంది టీడీఎల్పీ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబునాయుడు. మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బాబు లేకుండా వెళ్లిన లాభం లేదని భావించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 తేదీనుంచి జరగనున్నాయి.…