ఏపీలో పోలీసులపై మాజీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా లేదా వైసీపీ రౌడీషీటర్లకు అనుచరులా అనే అనుమానాలు నెలకొన్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులు కారణమయ్యారని లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు…