ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘టాటా మోటార్స్’ భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను మరోసారి శాసించేందుకు సిద్దమైంది. అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో ఎస్‌యూవీ ‘టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్’ను ఈరోజు అధికారికంగా లాంచ్ చేసింది. 2021 అక్టోబర్‌లో లాంచ్ అయిన టాటా పంచ్‌కు ఇది ఫేస్‌లిఫ్ట్ కావడం విశేషం. కొత్త మోడల్‌లో డిజైన్, టెక్నాలజీ, భద్రత పరంగా టాటా కంపెనీ గణనీయమైన మార్పులు చేసింది. కంపెనీ భారతదేశపు మొట్టమొదటి iCNG AMT SUVని కూడా పరిచయం చేసింది. టాటా…