శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు.