Parasakthi: తమిళనాడులో పొంగల్ బరిలో నిలిచిన సినిమాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’ సెన్సార్ కష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా మరో శివకార్తికేయన్ ‘‘పరాశక్తి’’ సినిమాపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్‌కు సంబంధించిన చారిత్రక సంఘటనలను వక్రీకరించారని ఆరోపిస్తూ, పరాశక్తి సినిమాపై బ్యాన్ విధించాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది.…