త నెలలో కోయంబత్తూర్‌లో జరిగిన అత్యాచార ఘటనపై విశాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాధితురాలు ఆ ప్రదేశంలో ఉన్నందుకు ఆమెను నిందించడం దయచేసి ఆపండి.. మన దేశంలో పునరావృతమయ్యే ఈ రక్తసిక్తమైన అత్యాచారం అనే సమస్యను రాజకీయం చేయడం ఆపండి.. ఈ విషయంపై చర్చించకుండా ఉండేందుకు మీ కాళ్ళు మొక్కుతాను అని విశాల్ కోరారు.
తెలుగు–తమిళ సినీ పరిశ్రమల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో విశాల్. ‘ప్రేమ చదరంగం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్, ‘పందెం కోడి’తో స్టార్ హీరోగా స్థిరపడ్డారు. కానీ వరుసగా మూసపాత్రల్లో కనిపించడం వల్ల కొంతకాలంగా ఆయనకు హిట్ దూరమైంది. అయితే 12 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ‘మదగజరాజా’ సినిమాతో తిరిగి రంగప్రవేశం చేసి, సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రజంట్ పలు చిత్రాల్లో బిజీగా గడుపుతున్నారు. మూవీస్ విషయం పక్కన పెడితే విశాల్ ముక్కుసూటి మనిషి…