ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు వెళ్లి తమకు ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్లో పాదయాత్ర మొదలు పెట్టారు. పద్మారావు గౌడ్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.…