తెలంగాణ కాంగ్రెస్‌లో ఏక్ నిరంజన్ తయారయ్యారా? అంతా తానై నడపాలనుకుంటున్నారా? ఢిల్లీ స్థాయిలో నా పరపతి అరచేతి మందాన ఉంది. మిగతా వాళ్ళని లెక్కచేయాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా? తనలాగే వచ్చిన వారిని కావాలని పక్కకు పెడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? సమన్వయ లోపం, పరస్పరం గోతులు తీసుకోవడం, కలహించుకోవడమన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక మా పార్టీలో అలాగే ఉంటుంది. అదే మాకు బలం అని కూడా…