విశాఖలో రోజురోజుకీ పెరిగిపోతున్న నేరాల పట్ల పోలీసులు పౌరుల్ని అప్రమత్తం అవుతున్నారు. అన్నింటా పోలీసులు వుండలేరు కాబట్టి సీసీ టీవీల ద్వారా నేరగాళ్ళు ఆగడాలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు. దొంగల ముఠాల పాలిట సింహ స్వప్నం…కిడ్నాపర్ల ఆగడాలకు కళ్ళెం వేసే నిఘా నేత్రాలు..ఈవ్ టీజర్ల, ఆకతాయిలా దుమ్ముదులిపే మూడో కన్ను.. ఇలా నిందితుల పాలిట యమపాశంగా మారాయి సీసీటీవీలు. గంటల వ్యవధిలోనే నేరస్థులను కటకటాల పాలుచేస్తున్నాయి. కేసుల చేధనలో అండగా నిలుస్తున్నాయ్. మంచి సత్పలితాలు ఇస్తుండడంతో…