కశ్మీర్ ట్రావెల్స్ కుదేలవుతుంది. పహల్గావ్ ఘటనతో టూరిస్టులు వెనక్కి తగ్గుతున్నారు. చావు కంటే వేసవి తాపం బెటర్ అంటున్నారు పర్యటకులు. కశ్మీర్ హోటళ్ళ నుంచి ఫ్యూచర్ క్రెడిట్ అవకాశాలు ఇచ్చాయి. ఇప్పుడు బుక్ చేసుకున్నవి వచ్చే సీజన్ వరకూ రిజర్వులో ఉంచుకునే అవకాశం కల్పించాయి. విమాన టికెట్లు రద్దు చేసుకుంటే మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేస్తున్నాయి విమానయాన సంస్థలు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ఏర్పాటుతో టూరిస్టులకు ఊరట లభించింది.