సుమ కనకాల ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. ఈ నెల 22న రావాల్సిన ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. మే 6న మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదయం 11.07 నిమిషాలకు ఆవిష్కరించబోతున్నాడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ విలేజ్ డ్రామా టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది.…
(మార్చి 22న సుమ కనకాల పుట్టినరోజు)కోటలు దాటే మాటలు అంటారు కానీ, మాటలతో కోటలు కట్టిన మేటి మాటకారి సుమ కనకాల. తెలుగునాట వ్యాఖ్యాతలు సైతం సెలబ్రిటీ స్టేటస్ చవిచూస్తారని నిరూపించిన ఘనత సుమ సొంతం. నటి కావాలని పాతికేళ్ళ క్రితం బయలు దేరిన సుమ, వెండితెరపై అంతగా వెలగలేదు. కానీ, వందలాది చిత్రాలు వెండితరపై వెలగబోయేముందు జరిగే ఉత్సవాలలో మాత్రం సుమ గాత్రం విజయనాదం చేస్తూనే ఉంది. ఆమె వ్యాఖ్యానంతో సాగిన సినిమా ఉత్సవాలు, విజయోత్సవాలు…
Jayamma Panchayathi ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల నటిస్తున్న తాజా చిత్రమన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అయితే తాజాగా Jayamma Panchayathi సినిమా విడుదల తేదీని ఫన్నీ వీడియోతో అనౌన్స్…
‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్ లో సుమపై హీరో నాని వేసిన పంచులు పేలాయి. నాని మాట్లాడుతూ “మామూలుగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ హీరోలంతా సుమ డేట్ల కోసం వెయిట్ చేస్తారు. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు లేదా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు… ఏం చేయాలన్నా సరే సుమగారి డేట్ ఉందా ? అని ఆలోచిస్తాము. సుమ డేట్స్ ఉంటేనే ఈవెంట్ ప్లాన్ చేస్తాము.…
“జయమ్మ పంచాయితీ”లో సుమ గొడవ ఆసక్తికరంగా మారింది. యాంకర్ సుమ రీ-ఎంట్రీ చిత్రం “జయమ్మ పంచాయితీ” టీజర్ తాజాగా విడుదలైంది. రానా విడుదల చేసిన ఈ విలేజ్ డ్రామా మూవీ టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ పెద్ద, మొత్తం గ్రామస్తుల ముందు సుమ తన దృఢమైన వైఖరిని చూపడంతో టీజర్ ప్రారంభమవుతుంది. స్పష్టంగా ఆమె ఒక సమస్యపై న్యాయం కోరుతుందని అర్థమవుతోంది. అయితే ఆమె సమస్య ఏమిటన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్.…