దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు కరోనా కేసులు కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే సెకండ్ వేవ్ లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం కరోనా మహమ్మారి కారణంగా తమ ఆత్మీయులను పోగొట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమ పలువురు నటీనటులతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలను సైతం కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ వర్ధమాన దర్శకుడు సుబ్బు తల్లి కరోనాతో కన్నుమూశారు.…