టీమిండియా అంటేనే రెచ్చిపోయే బ్యాటరలలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లలో భారత బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. భారత జట్టుపై స్మిత్ హాఫ్ సెంచరీ, సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో గబ్బాలో జరిగిన మూడో టెస్ట్‌లో శతకం బాదిన స్మిత్.. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేశాడు. స్మిత్‌కు ఇది టెస్ట్ కెరీర్‌లో 34వ సెంచరీ. అదేసమయంలో మెల్‌బోర్న్‌లో ఐదవ శతకం.…