దీపావళి వస్తుందంటే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తూ ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు కూడా గిఫ్టులు ఇస్తూ ఉద్యోగుల ఆనందంలో పాలుపంచుకుంటాయి. తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి శుభ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగులకు బహుమతిని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోనస్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల కృషి, అంకితభావానికి రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతను సూచిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతిలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వం ప్రతి…
తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించే ఏపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు రేపు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు.