Sridhar Babu: తెలంగాణ సెక్రటేరియట్‌లో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్థిక అరచకత్వానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూస్తూ పని చేస్తున్నామని అన్నారు. కొన్ని ప్రసార, ప్రచార మాధ్యమాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు క్యాబినెట్ నిర్ణయాలపై కేటీఆర్ అనేక విమర్శలు చేశారని,…