టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి శ్రీదేవి విజయ్‌కుమార్. అందం, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో 2000 దశకంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఒక దశలో స్టార్ హీరోయిన్ల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌తో కలిసి చేసిన ‘ఈశ్వర్’ సినిమాలో ఆమె నటన, లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే పెళ్లి, కుటుంబ జీవితం కారణంగా సినిమాలకు దూరమైన శ్రీదేవి, చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు.…