గత యేడాది సెప్టెంబర్ 5న కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో సుధీర్ బాబు ‘వి’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. జనవరిలో అది థియేట్రికల్ రిలీజ్ అయినా ప్రతికూల ఫలితమే దక్కింది. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. గత యేడాది మార్చిలో వచ్చిన ‘పలాస’ మూవీతో దర్శకుడిగా పరిచయమై, మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ తెరకెక్కించిన రెండవ…