భారతీయ పురాణ, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందునా నటరత్న యన్.టి.రామారావు నటించిన అనేక పౌరాణిక చిత్రాలు ఆబాలగోపాలానికి పురాణాల్లో దాగిన పలు అంశాలను విప్పి చెప్పాయి. అలాంటి చిత్రమే ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’. నిజానికి ఈ కథ పురాణాల్లో కనిపించక పోయినా, శ్రీరాముడు వైకుంఠయానం చేసేటపుడు ఆంజనేయుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే తనతో పాటు తన భక్తుని తీసుకువెళ్ళేవాడు కదా అనే వాదన ఉన్నది. అందునిమిత్తమై, రామాయణంలోని కొన్ని అంశాలను ఆంజనేయునికి రాముడే దేశబహిష్కరణ విధించేలా…