హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. చత్తీస్ గఢ్ నుంచి కోస్తా మీదుగా ఏర్పడిన ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని దీంతో రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. రాబోయే రెండు రోజులు గోవా, కర్నాటకతో పాటు దక్షిణ ఏపీలోని…