India Pak War: పాకిస్తాన్ తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూ భారత సరిహద్దుల్లో రెచ్చగొట్టే దాడులకు తెగబడుతోంది. గురువారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్ జెట్లతో దాడులకు ప్రయత్నించింది పాక్. ముఖ్యంగా శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ విమానాలు చొచ్చుకురావడానికి ప్రయత్నించాయని భారత సైన్యం వెల్లడించింది. ఈ మేరకు కల్నల్ సోఫియా ఖురేషి తాజాగా వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో దాడులు చేస్తోందని ఆమె…