రెండురోజుల క్రితమే దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగింది. ప్రతి ఒక్కరూ తమ ఛాతిపై చిన్న జెండాను పెట్టుకున్నారు. ఇంటిపై పెద్ద జెండాను హర్ ఘర్ తిరంగా అంటూ ఎగురవేశారు. అంతేకాదు తమ వాట్సప్ డీపీల్లో కూడా జాతీయ జెండాను పెట్టేసుకున్నారు. తరువాత రోజు మాత్రం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. జెండాలను ఎక్కడ ఉంచామో కూడా గుర్తులేనంతగా తన పనుల్లో మునిగిపోయారు. కొందరైతే వాటిని…