హైదరాబాద్‌లోని శివశక్తి ఫౌండేషన్‌పై సినీ నటి కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ ఓ దుష్టశక్తి అని అభివర్ణించారు. అమాయక హిందువుల నుంచి ఈ ఫౌండేషన్ విరాళాలను సేకరిస్తోందని.. వాటిని సొంత అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. శివశక్తి ఫౌండేషన్‌లో పాత సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులను దారి మళ్లించారన్నారు. శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఏర్పాటుకు రెండున్నర కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేశారన్నారు. Read Also: అయ్య బాబోయ్… ప్రతిరోజూ రూ.కోటిన్నర జరిమానాలు…