శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ చిత్రాన్ని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విశేషాలు ఇవీ: వైవిధ్యమైన వినోదం: ‘సారంగపాణి జాతకం’లో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్ వంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఇంద్రగంటి చెప్పిన కథ…