తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నో వైవిధ్యభరితమైన పాటలను అందించిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొన్ని రోజుల అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. హ్యట్రిక్‌గా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల మన మధ్యలేరని విషయం తెలియడంతో ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల మృతిపై స్పందించిన నందమూరి బాలకృష్ణ.. ‘సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని…
ఏ గీత రచయితకైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కసారైనా ఉత్తమ గీత రచయితగా నిలవాలన్న అభిలాష ఉంటుంది. తెలుగు చిత్రసీమలోనూ అలాంటి కోరికతో ఎంతోమంది గీతరచయితలు సాగుతున్నారు. కొందరిని అవార్డులు వరించాయి. కొందరి పాటలు మురిపించినా, జనం రివార్డులతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. తెలుగు సినిమా రంగంలో పదకొండు సార్లు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్న ఏకైక గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చరిత్ర సృష్టించారు. ఆ మాటకొస్తే నంది అవార్డుల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక పాటల రచయిత…
తనదైన శైలితో తెలుగువారిని విశేషంగా అలరించిన గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి శాశ్వతంగా కలం మూసేశారు. తెలుగు సినిమా పాటలతోటలో సీతారామశాస్త్రి వాణి, బాణీ ప్రత్యేకమైనవి. ‘సిరివెన్నెల’ సినిమాలో అన్ని పాటలూ పలికించి, జనాన్ని పులకింప చేసిన సీతారామశాస్త్రి, ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా జేజేలు అందుకున్న ఆయన కొద్ది రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిమోనియాతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచీ వెంటిలేటర్ పై ఉన్న సీతారామశాస్త్రి…