Simla Agreement: పహల్గామ్ ఉగ్రదాడి, ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ -పాక్ మధ్య 1972లో ‘‘సిమ్లా ఒప్పందం’’ జరిగిన చారిత్రాత్మక టేబుల్‌పై ‘‘పాకిస్తాన్ జెండా’’ కనిపించకుండా పోయింది. భారత్, పాక్‌తో సంబంధాలను నిలిపేసిన ఒక రోజు తర్వాత ఈ విషయం జరిగింది. మంగళవారం, పహల్గామ్‌లో 26 మంది అమాయకపు టూరిస్టులను లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కిరాతకంగా చంపేసింది.
Simla Agreement: భారత్‌పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. పహల్గామ్ దాడి కూడా ఈ కోవకు చెందిందే. లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో, భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే, ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ రద్దు చేసుకుంది. అట్టారీ బోర్డర్‌ని మూసేసింది.పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలు దిగుతోంది. భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది.…