లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ సిక్కులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ వైపు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఇంకోవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మాత్రం మద్దతు తెలిపాడు.