సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ప్రమాదంపై సిగాచీ కంపెనీ స్పందించింది. పరిశ్రమలో పేలుడు కారణంగా 40 మంది మృతి చెందారని, మరో 33 మంది గాయపడినట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్ని బీమా క్లైమ్ ఇస్తామని స్పష్టం చేసింది. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని సిగాచీ కంపెనీ హామీ ఇచ్చింది. ఈ మేరకు సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్…
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య ఇప్పటివరకు 40 దాటినట్లు సమాచారం. కార్మికులు చనిపోవడంతో సిగాచి పరిశ్రమ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదైంది. అయితే సిగాచి పరిశ్రమ, అధికారుల లెక్కలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. Also Read: Medaram Jatara 2026: మేడారం మహాజాతర తేదీలు ఖరారు! ప్రమాద సమయంలో పరిశ్రమలో డ్యూటికి 162…
ప్రేమించుకున్నారు.. కలిసి నడుద్దాం అనుకున్నారు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.. నీకు నేను.. నాకు నువ్వు అనుకున్నారు.. ఈ ఇద్దరి ప్రేమకు ఆ రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి.. ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగంలో చేరారు.. అయితే, వారి ప్రేమను మృత్యువు కూడా విడదీయలేదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన పేలుడు ఘటన చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా.. మృతదేహాలకు పఠాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేశారు వైద్యులు