ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు. లోయర్ బెర్త్‌లోనైతా కిటికి పక్కన కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. అవసరమైనప్పుడు ఫ్రీగా బోగీలో నడవడానికి వీలుంటుంది. అదే మిడిల్ లేదా అప్పర్ బెర్త్ విషయానికి వస్తే అయితే.. పైనకు ఎక్కి పడుకోవాలి, లేదంటే ఫ్లోర్ పై నిలబడాలి అన్నట్టుగా ఉంటుంది. అందుకే లోయర్ బెర్త్‌కు డిమాండ్ ఎక్కువ.