Siddipet District: అప్పుల బాధ భరించలేక గడ్డి మందు త్రాగి దంపతుల ఆత్మహత్య ఘటన కలచివేసింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష-రుక్మిణి దంపతులు అదే గ్రామానికి చెందిన పలువురి వద్ద లక్షల్లో అప్పులు చేశారు. డబ్బులు ఇవ్వాలని శ్రీహర్షని అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు బెదిరించారు. నిన్నటి రోజు(శనివారం) డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ.. ఆదివారం చెల్లించాలన్నారు. నేటితో గడువు ముగియడంతో గ్రామంలో తన పరువు పోతుందని పురుగుల మందు…