ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా.. ఆయన అభిమానులు OG..OG అంటూ కేకలు వేశారు. దీంతో పవన్ మాట్లాడుతూ.. సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే బాగుంటుందని అభిమానులకు సూచించారు. సినిమాలు ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.