తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు వారి ఇద్దరు కుమార్తెలు.. శివానీ, శివాత్మిక. కాగా ఇందులో 2019లో విడుదలైన ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది శివాత్మిక . తన తొలి సినిమాలోనే మంచి అభినయం చూపించి, సైమా ఉత్తమ నూతన నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా.. శివాత్మిక నటనకు మంచి ప్రశంసలు…