కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. త్వరలో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కొత్త లోగోను అవిష్కరించింది. దీంతో పాటు మంగళవారం ( అక్టోబర్ 22) బీఎస్ఎన్‌ఎల్ ఏడు కొత్త ఫీచర్లను ప్రారంభించింది. బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తోంది.