పాత కథలకే కొత్త సొబగులు అద్ది సరికొత్తగా మలచి అలరించారు ఎందరో దర్శకులు. ఈ తరం దర్శకులు కూడా అదే తీరున సాగుతున్నారు. అలాంటి విన్యాసాలు ఏ నాడో చేసి ఆకట్టుకున్నారు దర్శకరచయిత, నటుడు భాగ్యరాజా. ఈ తరం వారికి దర్శకునిగా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. నవతరం ప్రేక్షకులలో కొంతమందికి ఆయన నటునిగా పరిచయం ఉన్నారు. చాలా రోజుల నుంచే భాగ్యరాజా నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా కనిపిస్తున్నారు. అయితే నటునిగా,…
ముక్కుసూటి తనానికి మారుపేరుగా నిలిచారు హిందీ స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా! అందుకే ఆయనను బాలీవుడ్ లో అభిమానంగా ‘షాట్ గన్ సిన్హా’ అనీ పిలుస్తుంటారు. ‘బీహారీ బాబు’గానూ ఆయనకు పేరుంది. శత్రుఘ్న సిన్హా తనదైన విలక్షణ అభినయంతో ఆకట్టుకున్నారు. ‘మేధావి’ అనే తెలుగు చిత్రంలోనూ ఆయన నటించారు. తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘రక్తచరిత్ర’లోనూ శత్రుఘ్న సిన్హా అభినయించారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ శత్రుఘ్న సిన్హా రాణించారు. దేశ…