సీనియర్ బాలీవుడ్ నటుడు సలీమ్ గౌస్ (70) గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య అనిత సలీమ్ ధృవపరిచారు. ‘బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని సలీమ్ చెప్పడంతో, కోకిలాబెన్ హాస్పిటల్ లో చేర్చామని, గురువారం ఉదయం ఆయన హార్ట్ అటాక్ తో కన్నుమూశార’ని ఆమె తెలిపారు. ‘భారత్ ఏక్ ఖోజ్’, ‘సుబహ్’, ‘ఇన్కార్’ తో పాటు పలు టీవీ సీరియల్స్ లో సలీమ్ గౌస్ కీలకపాత్రలు పోషించారు. అలానే ‘సారాంశ్,…