18 ఏళ్ల క్రితం ‘ఆర్య’తో దర్శకుడు సుకుమార్‌ను లాంచ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వీరిద్దరూ కలిసి పని చేయలేదు. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత దిల్ రాజు ఓ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి “సెల్ఫిష్” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. Read Also…