తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగుల వ్యవహారం బయటపడింది. నకిలీ ఉద్యోగుల కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పూర్తి ఆధారాలు సేకరించి.. చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్‌కు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి…