గత వారం చైనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారు ప్రయాణం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పెద్దపెద్ద సదస్సుల్లో దేశాధినేతలు వేర్వేరు కార్ల కాన్వాయ్‌ల్లో వేదికల వద్దకు చేరుకొంటారు. కానీ, తింజియన్‌లోని షాంఘై సహకార సదస్సులో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో బయల్దేరి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఇద్దరూ దాదాపు 45 నిమిషాలు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కానీ..…