స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు. లక్షలాది మంది కస్టమర్లకు ఎస్బీఐ బిగ్ షాకిచ్చింది. ఎస్బీఐ ATM, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్‌డ్రావల్ మెషిన్ (ADWM) లావాదేవీ ఛార్జీలను సవరించింది. జీతం ఖాతాదారులకు అందించే అపరిమిత సేవను కూడా బ్యాంక్ నిలిపివేసింది. ఇంటర్‌చేంజ్ ఫీజులతో సహా ATM సేవల ధరలను SBI సమీక్షించింది. ఇంటర్‌చేంజ్ ఫీజులు అంటే బ్యాంకులు మరొక బ్యాంకు ATMని ఉపయోగించినందుకు చెల్లించే ఛార్జీలు. సవరణ తర్వాత ఈ ఫీజులను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.…