హనుమంతుడుపై టాలీవుడ్ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా ఆయన సినిమాలు ఆపేస్తాం అంటూ విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. తండ్రి మనోభావాలను సైతం కించపరుస్తూ మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా? అని ప్రశ్నించారు. హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని రాజమౌళిని రవికుమార్ హెచ్చరించారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్ర వేదనకు…