జీ తెలుగు ఆవిర్భావం నుంచి విలక్షణమైన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలు, సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. వినోదాల పరంపరను కొనసాగిస్తూ జీ తెలుగు పాపులర్ షో సరిగమప సరికొత్త సీజన్తో వచ్చేస్తోంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో విజయవంతంగా 15 సీజన్లు పూర్తిచేసుకున్న జీ తెలుగు సరిగమప తన తదుపరి సీజన్ను ఘనంగా ప్రారంభిస్తోంది. సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్…