మతం పేరుతో రాజకీయాలు చేసే విధ్వంసకర శక్తులను ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్… హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పర్యటిస్తున్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.. పలు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ ముందుకు పోతామన్నారు. నేను చదువుకునే రోజుల్లో వారానికి రెండుమూడ్రోజులు కర్ఫ్యూ ఉండేదని గుర్తుచేసుకున్న ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రశాంత వాతావరణం…