పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఇందులో ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగకు ఈ నెల 14న “కళ్యాణం కమనీయం” విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు సినిమాలో నటించిన అనుభవాలు తెలిపారు…