బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడోరోజు ఆట ముగిసేసరికి 231/3 స్కోరుతో నిలిచింది. రోహిత్ సేన ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఆట చివరి బంతికి విరాట్ కోహ్లీ (70) అవుట్ కాగా.. క్రీజ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (70) ఉన్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ బ్యాటింగ్…