Boxer Lovlina Sensational Comments On Boxing Federation Of India: కామన్‌వెల్త్ 2022 క్రీడలకు సిద్ధమవుతున్న బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులు తనని మానసికంగా వేధిస్తున్నారని, కామన్‌వెల్త్ గేమ్స్‌కి ముందు కావాలనే టార్గెట్ చేస్తున్నారని బాంబ్ పేల్చింది. లోపల చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయని, తాను మెడల్ సాధించడానికి ప్రోత్సాహించిన కోచ్‌లను మారుస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆమె కుండబద్దలు కొట్టింది.…