శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని దర్శించుకున్నారు ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. వచ్చే నెల రెండు నుంచి జరిగే శ్రీ రామానుజ సహస్ర శతాబ్ది ఉత్సవ విశేషాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి వెలంపల్లి. వచ్చే నెల ఐదో తేదీన 216 అడుగుల సమతామూర్తి శ్రీ రామనుజుల వారి విగ్రహావిష్కరణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి వెలంపల్లి. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి లైజనింగ్ ఆఫీసర్లుగా ఇద్దర్ని నియమించామని తెలిపారు…
హైదరాబాద్ శంషాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమం మహాకార్యానికి వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. చినజీయర్ స్వామిని కలిశారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ దివ్యసాకేతానికి వెళ్లారు శివరాజ్ సింగ్ చౌహాన్. కుటుంబసభ్యులతో కలిసి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రతిష్ఠాత్మకంగా…