Talasani Srinivas Yadav: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న గోపాలమిత్రలకు దసరాకు ఒకరోజు ముందే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీపికబురు అందించారు. ప్రస్తుతం గోపాల మిత్రలకు నెలకు రూ.8,500 చెల్లిస్తుండగా.. 30శాతం జీతం పెంచనున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం అంటే రూ.2,550 పెంచి మొత్తం రూ.11,050 ఇస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడమే కాకుండా…