రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “సైదులు”. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాతో బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు బెనర్జీ కీలకపాత్రలో నటించారు. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో సినిమా కథ ఉండబోతుంది. 1980లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తీస్తున్నారు మేకర్స్. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో…