రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “సైదులు”. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాతో బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు బెనర్జీ కీలకపాత్రలో నటించారు. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో సినిమా కథ ఉండబోతుంది. 1980లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తీస్తున్నారు మేకర్స్. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న “సైదులు” చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు మేకర్స్ శ్రీకారం చుడుతున్నారు.
Read Also : KGF 2 : రాఖీభాయ్ వచ్చేస్తున్నాడోచ్… రూట్ మ్యాప్ రివీల్ !
ఈ మేరకు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు చేశారు. “సైదులు” మూవీ ట్రైలర్ ఏప్రిల్ 17న నిర్వహించబోతున్నా గ్రాండ్ ఈవెంట్ లో విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి పలువురు ఫిలిం సెలబ్రిటీలు హాజరుకానున్నారు. కాగా సినిమాకు పి.యస్ మణికర్ణన్ సినిమాటోగ్రఫీ, ఎన్.ఎస్.ప్రసు సంగీతం అందిస్తుండగా, మరబత్తుల బ్రహ్మానందం నిర్మిస్తున్నారు.